దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్.
అమరావతి (AIMA MEDIA): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.ఈ నేపథ్యంలో తాడేపల్లి, ఉండవల్లితోపాటు 4 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.విశాఖపట్నంలోని ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ ప్లస్ 2 భవనంతోపాటు 770 గ్రాముల బంగారం నగలు, 3 కిలోల వెండిని గుర్తించారు. ఇంట్లోనే కాకుండా బ్యాంకు ఖాతాల్లో సైతం భారీగా నగదు ఉన్నట్లు కనుగొన్నారు.వీటితోపాటు కారు, ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో గుర్తించారు. కె. శాంతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్లో ఉన్నారు.