పాతపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు గారితో మరియు మంత్రులతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్..
AIMA న్యూస్ :
పాతపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు గారితో జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు,మరియు సహచర ఎమ్మెల్యేల తో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*
*▪️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశంలో పాతపట్నం ఎమ్మెల్యే గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు పాల్గొన్నారు.నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న కీలక సాగునీటి ప్రాజెక్టులు, వైద్య, విద్యా రంగాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఆయన వివరణాత్మక నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు , కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు గారు పాల్గొన్నారు.*
*▪️పాతపట్నం నియోజకవర్గ సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం కొరకు సీది, కోసమల, మజ్జిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు నిధుల కొరకు విన్నపం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు .*
*▪️వైద్య సేవలు మరింత చేరువగా పాతపట్నం CHCని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు.*
*▪️భగీరథపురం నుండి హిరమండలం ఎంపీడీవో ఆఫీస్ వరకు నూతన బ్రిడ్జ్ కావాలని కోరిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు*
*▪️యువతకు సాంకేతిక విద్య కొరకు నియోజకవర్గంలో కొత్తగా పాలిటెక్నిక్ మరియు ఐటిఐ (ITI) కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు.*
*▪️వంశధార నిర్వాసితులకు న్యాయం & పర్యాటక రంగ అభివృద్ధి మరియు ఆర్ అండ్ ఆర్ (R&R) ప్యాకేజీ మరియు రిజర్వాయర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.*
*▪️ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు అయిన పాతపట్నం మండలంలోని సీది, మెలియాపుట్టి మండలంలోని కోసమల,హిరమండలంలోని మజ్జిగూడెం,లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.*
*▪️వైద్యం పరంగా ప్రస్తుతం ఉన్న 50 పడకల పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (CHC) 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా 75 గ్రామాలకు చెందిన 90 వేల మందికి మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.*
*▪️ నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు 180 సీట్ల సామర్థ్యం గల పాలిటెక్నిక్ కళాశాలను మరియు ఐటిఐ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఇందుకు 3 ఎకరాల భూమి అందుబాటులో ఉందని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు.*
*▪️వంశధార R&R సమస్యలు,హిరమండలం రిజర్వాయర్ నిర్వాసితులకు రావలసిన పెండింగ్ పరిహారం, ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు గతంలో నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు.*
*▪️టూరిజం & ఐటిడిఏ వంశధార రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా (Eco-Tourism) తీర్చిదిద్దడం ద్వారా ఉపాధి కల్పించాలని, అలాగే మెలియాపుట్టిలో ఐటిడిఏ (ITDA) కార్యకలాపాలను బలోపేతం చేసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు సీఎం గారిని కోరారు.*
*▪️దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు , సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.*