logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ సర్వసౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞానయజ్ఞ ఆహ్వానం

🌺 శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞాన యజ్ఞం ఆహ్వానం 🌺
ప్రియాత్మ బంధువులారా!
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర మాస బహుళ అష్టమి, నవమి, దశమి సందర్భంగా
తేదీలు: 10-04-2026 నుండి 12-04-2026 వరకు (శుక్ర, శని, ఆదివారాలు)
ముగ్గురమ్మల మూలపుటమ్మ, జగన్మాత శ్రీ దుర్గాదేవి అనుగ్రహంతో
శ్రీ సర్వ సౌభాగ్య దేవిత్రయ గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించబడును.
భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి
ఆమె కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించుచున్నాము.
📅 కార్యక్రమ వివరాలు
🔸 తేది: 10-04-2026 (శుక్రవారం)
ఉదయం 8:00 గంటలకు:
యాగశాల ప్రవేశం
ఓంకార ప్రణవ పతాకావిష్కరణ
మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం
గోపూజ, కలశ స్థాపన, అఖండ దీపారాధన
రక్షాబంధనం, ఋత్విక్కరణం
ఉదయం 8:30 గంటలకు:
పంచగవ్య ప్రాశనం
విద్యార్థులకు బీజాక్షర లేఖనం
మంటపారాధన, అభిషేకాలు, అర్చనలు
గణపతి, నవగ్రహ హవనం
జ్ఞానసరస్వతి హవనం
మహానివేదన, మంగళహారతి
సాయంత్రం 6:30 గంటలకు:
జ్ఞానసరస్వతి అమ్మవారికి శ్వేత పుష్పాలతో విశేషార్చన
వేదపారాయణం, మహానివేదన
మంగళహారతి, తీర్థప్రసాదం
🔸 తేది: 11-04-2026 (శనివారం)
ఉదయం 7:24 గంటలకు:
యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ
ధనలక్ష్మీ దేవి విశేషాభిషేకం
ఉదయం 9:00 గంటలకు:
గణపతి, శ్రీ సూక్త, పురుషసూక్త హవనాలు
మహానివేదన, తీర్థప్రసాదం
సాయంత్రం 6:30 గంటలకు:
ప్రదోషకాల పూజ
ధనలక్ష్మీ దేవికి కుంకుమార్చనలు
దీపాలంకరణ, వేదపారాయణం
మంగళహారతి
🔸 తేది: 12-04-2026 (ఆదివారం)
ఉదయం 6:30 గంటలకు:
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
మహారుద్రాభిషేకం, బిల్వార్చన
కనకదుర్గ అమ్మవారికి విశేషాభిషేకం
దుర్గా సహస్రనామ, హోమాలు
ఉదయం 11:30 గంటలకు:
శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కళ్యాణం
మధ్యాహ్నం 12:45 గంటలకు:
మహా పూర్ణాహుతి
మహా మంగళహారతి
ఆశీర్వచనం, తీర్థప్రసాదం
దాతలకు సత్కారం
📢 ప్రత్యేక సూచనలు
ఈ మూడు రోజులు భగవద్గీత యజ్ఞం జరుగును
భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే పాల్గొనగలరు
📞 వివరాలకు సంప్రదించండి:
📱 9959422244
📱 9704594219

0
0 views

Comment