logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు



భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలో 1980 లో స్థాపించబడింది.1977 తరువాత జనతా పార్టీ నుంచి విడిపోయాక జన సంగ్ వారసత్వంగా ఏర్పడింది.గత 47 ఏళ్లుగా దేశమే ప్రథమం అనే నినాదం తో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. బిజెపి ఆవిర్భావ దినోత్సవం పార్వతీపురం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో బిజెపి మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా పార్వతిపురం మన్యం జిల్లా ఎస్ .టి మోర్చా అధ్యక్షులు డాక్టర్ వి. హేమా నాయక్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.బైక్ ర్యాలీ నిర్వహించారు.జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నారు. పలువురు కార్యకర్తలు, నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

79
1919 views

Comment