logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్రామీణ పేద విద్యార్థులకు ఐఐటి–నీట్ ఉచిత శిక్షణ: ఫిజిక్స్ వాలాతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ ప్రారంభం

అనకాపల్లి జిల్లా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఐఐటి ,నీట్ పోటీ పరీక్షలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఉచిత శిక్షణ కల్పించే కార్యక్రమాన్ని సమర్పణ సంస్థ, వేద విద్యా సంస్థ కలిసి ఫిజిక్స్ వాలా తో జాతీయ స్థాయిలో ప్రారంభించాయి.
సమర్పణ సంస్థ చైర్మన్, ఉత్తర ప్రదేశ్ ఐజీ కిల్లాడ సత్యనారాయణ, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు ఈ వివరాలను విలేకరులకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులకు సరైన కోచింగ్ సదుపాయాలు లేక ఐఐటి ,నీట్ వంటి పరీక్షలకు హాజరు కాలేకపోవడం, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో ప్రతిభ నిరుపయోగం అవుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఇలాంటి వారిని గుర్తించి ఉచిత శిక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలోని పలు పాఠశాలల్లో 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో ప్రారంభ దశలో సుమారు 50 మందిని ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తామని, వారికి సుమారు రూ. 3,000 విలువైన బుక్స్ మరియు స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న, ఐదు కోట్ల మంది విద్యార్థులకు ఐఐటి,జె ఈ ఈ, నీట్ శిక్షణ ఇస్తున్న ప్రముఖ ఎడ్‑టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా తో కలిసి న్యూ ఢిల్లీలో వారి ఆన్‌లైన్ శిక్షణ, అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెం, రోలుగుంట, కొత్తకోట ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించి ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు వారు వివరించారు. ఈ నెల 12న మాకవరపాలెం, రోలుగుంట, కొత్తకోటలో శిక్షణా కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని, ఆ సందర్భంగా ప్రవేశ పరీక్షల ఫలితాలను వెల్లడించి, ఎంపికైన విద్యార్థులకు కోచింగ్ ప్రవేశ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా అవకాశం కల్పిస్తాం, తదుపరి దిశానిర్దేశం, చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం పాఠకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు 9640121024 నెంబర్‌కు సంప్రదించాలని సంస్థ సూచించింది.

9
675 views

Comment