ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రె
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.
✳️ బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపనలు చేశారు.
✳️శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:
▪️ బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామంలో (₹ 200 కోట్ల అంచనా వ్యయం) యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం.
▪️ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో (₹ 200 కోట్లు) యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం.
▪️ బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో (₹ 45.15 కోట్ల అంచనా వ్యయం) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం.
▪️ శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన (₹ 20.10 కోట్ల అంచనా వ్యయం).
▪️ ఆదిలాబాద్ నియోజకవర్గంలో (₹ 20 కోట్ల అంచనా వ్యయం) తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాల (బాలికలు) భవనం.
▪️ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో (₹ 13.46 కోట్ల అంచనా వ్యయం) నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభోత్సవం.
▪️ ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన (₹ 15.00 కోట్లు).
▪️ బోథ్ నియోజకవర్గం (₹ 30.00 కోట్ల అంచనా వ్యయం) ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం రోడ్డు నిర్మాణం.
▪️ ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్‌లో (₹ 20 కోట్లు) మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) భవనం.
▪️ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో (₹ 30 కోట్ల) 38 వివిధ రకాల అభివృద్ధి పనులు.
▪️ బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్‌లలో (₹ 8.99 కోట్ల అంచనా వ్యయంతో) 3 (33/11KV) విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం.
▪️ బోథ్ నియోజకవర్గంలో (₹ 50.70 కోట్ల అంచనాలతో) పిప్రి ఎత్తిపోతల పథకం.
▪️ బోథ్ నియోజకవర్గంలో (₹ 44.64 కోట్లు) తేజాపూర్ ఎత్తిపోతల పథకం.
▪️ ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో (₹ 65.85 కోట్ల అంచనా వ్యయం) ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకం.
▪️ ఆదిలాబాద్ నియోజకవర్గంలో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర (₹ 6.435 కోట్ల అంచనా) చెక్ డ్యాం నిర్మాణం.
▪️ ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో (₹ 31.52 కోట్ల అంచనా) చిక్‌మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణం.
▪️ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ (₹ 11.76 కోట్ల అంచనాతో) రిపేర్ పనులకు శంకుస్థాపన.