బద్వేల్ లో పాత కక్షలు
బద్వేల్ లో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నెల్లూరు రోడ్డు డాబా దగ్గర రోజు లాగానే టీ కొట్టు దగ్గర టీ తాగి మార్తోమ నగరకు వెళ్తున్న అల్లూరి వెంకటేశయ్య అనే 70 ఏళ్ల వయసు గల వ్యక్తిని అదే మార్తోమా నగరకు చెందిన నలుగురు వ్యక్తులు దారి కాచి పాత కక్షలు మనసులో పెట్టుకొని కాళ్లతో చేతులతో కట్టెలతో చిత్రవదగా హింసించి కొట్టడం జరిగింది అలాగే ఆయన దగ్గర ఉన్న 20వేల రూపాయలు ఫోను కొంత నగదును లాక్కొని వెళ్లడం జరిగింది. ఆయన దండం పెడుతున్న కూడా వదలకుండా క్రూరంగా కొట్టి అక్కడ వదిలేసి వెళ్లారు . ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కుమారుడు వచ్చి అత్యవసర పరిస్థితుల్లో బద్వేలు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కడప రిమ్స్ తరలించడం జరిగింది. ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.