*బంగ్లా సరిహద్దు జలాల్లోకి మొసళ్లు, పాములు..?
*బంగ్లా సరిహద్దు జలాల్లోకి మొసళ్లు, పాములు..?*
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, నేర కార్యకలాపాలను అరికట్టేందుకు భారత్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బంగ్లా సరిహద్దు జలాల్లో మొసళ్లు, పాములను వదలాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమో పరిశీలించాలని ప్రాంతీయ కేంద్రాలకు బీఎస్ఎఫ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఆలోచన పరిశీలన దశలోనే ఉందని, ఇంకా అమలు కాలేదని, ఇందులో ఎన్నో సవాళ్లు ఉన్నాయని అధికార వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.