logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజధానిపై 9 సార్లు మాట మార్చి ఇప్పుడు మావిగన్ అంటే జనం నవ్వుతున్నారు: మంత్రి జి. సంధ్యారాణి



పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో అమరావతి రాజధానికి మద్దతుగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
మంత్రి కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ జరిగింది.
పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
చంద్రన్న పిలుపు…
అమరావతి గెలుపు..
రాజధానిపై జగన్ విష ప్రచారం, ఎవరు తలచుకున్నా రాజధానిని ఇక మార్చలేరు
గన్… జగన్… మావిగన్.. ప్రాస కోసమా ? పేరు కోసమా అని నవ్వుతున్న ప్రజలు
తుగ్లక్ పేరు చదివాం, విన్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం…
అమరావతి ఆర్థిక శక్తిగా మారి, రాష్ట్ర అభివృద్ధికి బాటలు
జగన్ విధ్వంసానికి చెక్…
పిచ్చి మాటలకు డబల్ చెక్..
పార్లమెంట్‌లో వివిధ పార్టీల మద్దతు… వైసీపీ మాత్రం వాకౌట్..
అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు… విధ్వంసం చేసిన జగన్..
మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో జగన్ చిచ్చు
విలువలు, విశ్వసనీయతపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో సాగుతోంది
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు
గత వారం రోజులుగా 5 కోట్ల మంది ప్రజలు సంబరంగా, ఆనందోత్సవాలతో పండుగ చేసుకుంటున్నార‌ు.
అమరావతి చట్టబద్ధత విషయంలో దేశంలోని 50కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించి సభ నుంచి వాకౌట్ చేసింది…
ఎంత దుర్మార్గమైన చర్య??
ఎంత దురదృష్టం??
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాంతాలు, వర్గాల మధ్య విభేదాలు రాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి, ఎమ్మెల్యేలు, మంత్రులు, మేధావులతో చర్చలు జరిపి అందరి అభిప్రాయంతోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు
ఆ సమయంలో వైసీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపింది, 30 వేల ఎకరాలు ఉంటేనే రాజధాని నిర్మాణం బాగుంటుందని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక మాట మార్చి అమరావతిని, భ్రమరావతి, కమరావతి, శ్మశానం, ఎడారి అంటూ దూషించారు.. ఒక జాతి, కులంపై నీచ వ్యాఖ్యలు చేయించారు.. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించి, ఒక్కటంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు..
మూడు రాజధానుల పేరుతో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేసిన జగన్ & కో
విలువలు, నమ్మకం, బాధ్యత, న్యాయం, ధర్మం, పరిపాలన, విశ్వసనీయత వంటి పదాలు మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు..
రాజధాని విషయంలో తొమ్మిది సార్లు మాట మార్చి, ఇప్పుడు మావిగన్ అని చెబితే జగన్ రెడ్డి ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. 151 నుంచి 11 కి పడేసినా బుద్ధి రాలేదా అని ప్రజలు విసుక్కుంటున్నారు
అమరావతిని నమ్మి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు … రైతుల కష్టాలు తీరాయి..
ప్రజల ఆకాంక్ష, ఆశ, కోరిక అన్నీ రాజధాని అమరావతే..
జై అమరావతి అని మంత్రి సంధ్యారాణి అన్నారు.

13
615 views

Comment