logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కుబీర్ గ్రామంలో హిందూ సమ్మేళనము: ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు:



కుబీర్ గ్రామంలోని శ్రీ విఠలేశ్వర మందిరం నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 7 సాయంత్రం 4 గంటలకు""హిందూ సమ్మేళన కార్యక్రమము"""ఏర్పాటు చేస్తున్నందున ఇందులో కుబీర్ గ్రామము మరియు కుబీర్ ఉప మండల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొవాలని, హిందూ బంధువులందరూ ఏకతాటిపై ఉండి విశ్వ గురువుగా నిలబడడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, ఈ కార్యక్రమంలో భాగంగా గోమాత పూజ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సామూహిక కుంకుమార్చన ఉన్నందున, మన ధర్మం, సంస్కృతి, ఆచార్య వ్యవహారాలను మనకు క్లుప్తంగా వివరించడానికి """శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు"""కుబీర్ గ్రామం విచ్చేయడం ఎంతో శుభసూచకమని, ప్రతి గడప నుండి ఇంటిల్లిపాది హిందూ భక్తులందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యకర్తలు సరికొండ దామోదర్, నాగమణి లింగన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా"""హిందూ సమ్మేళనము కుబీర్ కమిటీ"""అధ్యక్షులు చిమ్మన్ అరవింద్ స్వామి, ప్రచార కమిటీ సభ్యులు, సాప పండరి, జీవన్ పటేల్, బోయిడి అభిషేక్, కోశాధికారి బిట్లింగ్ హనుమాన్లు, కుబీర్ ఉప మండల అధ్యక్షులు జాదవ్ పండిత్, హిందూ సమ్మేళనము కమిటీ సభ్యులు పడిపెల్లి గంగాధర్, వెంకటస్వామి, జి విటల్, నాయుడు పోశెట్టి, కొలిషిక్ వార్ సతీష్, కందూర్ శ్రీనివాస్, తోకల రాజు, సోనాలి హనుమాన్లు, ఏషాల దత్తాత్రీ, బంజ నాగేష్, బెల్గాం వైద్యనాథ్, గ్రామస్తులు దేవలోల్ల శ్రీనివాస్, వడ్నం స్వచ్ఛంద్ పలువురు పాల్గొన్నారు

5
542 views

Comment