logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*▪️ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో “నీటి భద్రత – సాగు నీటి సంరక్షణ” కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు..

AIMA న్యూస్ శ్రీకాకుళం :
పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో “నీటి భద్రత – సాగు నీటి సంరక్షణ” కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*

*▪️నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెరువులను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించవచ్చని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.*

*▪️ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల ఎర్ర చెరువు స్థానిక శాసనసభ్యులు శ్రీ నడికుదుటి ఈశ్వరరావు గారు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ప్రభుత్వ ఆదేశాలతో జల వనరుల శాఖ వద్ద నిర్వహించిన " నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత " కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నీటి భద్రత, రైతుల కొరకు చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా చెరువులు పునరుద్ధరణ పనులు, పూడీకతీత పనులుతో చెరువులను సంరక్షించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకొని క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించవచ్చు అని, ప్రజలందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రావాడా వెంకటరమణ గారు మండల అధికారులు,మండల నాయకులు, కార్యకర్తలు, నీటి సంఘాల నాయకులు, రైతులు, పాల్గొన్నారు.*

0
289 views

Comment