మున్సిపల్ ఎన్నికల వేళ ముందస్తు డ్రామా:మాజీ డిప్యూటీ సీఎం పిడిక.రాజన్న దొర
మున్సిపల్ ఎన్నికల వేళ ముందస్తు డ్రామా:మాజీ డిప్యూటీ సీఎం
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రోడ్ల విస్తరణకు మార్కింగ్ అంశం ఒక డ్రామాను తలపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్న దొర ఎద్దేవా చేశారు. తమ హయాంలో అధికార ,ప్రతిపక్ష ఎన్జీవో సమావేశం నిర్వహించి చర్చలు జరిపామని, అత్యుత్సాహం వలన ఇరుకునపడేది అధికారులే అన్నారు. 60 అడుగుల రోడ్లు విస్తరణ అంటూ హడావిడి చేయడం,మెయిన్ రోడ్ వర్తకులు మంత్రి సంధ్యారాణి వద్దకు వెళ్లి సమస్య తెలుపుట, ఆమె నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడం ఇదంతా డ్రామాలా అనిపిస్తోందన్నారు.