logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీజన్ గ్లోబల్ స్కూల్ నిర్లక్ష్యం పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి... అసలు ఏంటి ఈ "ముసుగులో గుద్దులాట"?





సాలూరు పురం ప్రాంతంలో ఉన్న శ్రీజన్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా తల్లికి వందనం అందని పరిస్థితి నెలకొంది.విద్యార్థుల అపార్ ఐడి, ఇతర ఆన్లైన్ వర్క్స్ సకాలంలో చేయకపోవటంతో తల్లికి వందనం పధకానికి అర్హత కోల్పోయారు.ఈ తల్లికి వందనం కి సంబందించి సచివాలయం చుట్టూ తిరిగినా విద్యార్థి యొక్క ఆపార్ ఐడి చేయటంలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వహించటమే కాకుండా తిరిగి ఆపార్ ఐడి వర్క్ అనేది ఎమ్ఈఓ కార్యాలయంలో అవుతుందని తప్పించుకునే ప్రయత్నంలో ఎమ్ఈఓ కార్యాలయంలో సిబ్బంది తమ వద్ద వందా యాభై తీసుకొని ఆన్లైన్ చేస్తుంటారు వాళ్లకు ఏమి కావాలి అంటే అది ఇస్తున్నాం అయినా వాళ్ళు చేయకపోతే మేం ఏమి చేస్తాం అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పును కప్పిపుచుకునే ప్రయత్నంలో ఎమ్ఈఓ కార్యాలయ సిబ్బంది పై తప్పు తోస్తూ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వటంతో పాటు తమ హక్కులపై విద్యార్థుల తల్లితండ్రులు ప్రశ్నిస్తే మాట్లాడుతుండగా ఫోన్ కట్ చేసి వారి కాసుల కక్కుర్తి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు.అసలు ఆ పాఠశాలలో ఏమి జరుగుతుంది అనే దానిపై జిల్లా కలెక్టర్ సమగ్ర జరిపించి అర్హత ఉండి తల్లికి వందనం పధకానికి దూరమైన విద్యార్థులకు న్యాయం చేయటం తో పాటు పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యం పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు. ఈ సంఘటనపై ఎమ్ఈఓ కార్యాలయం లో ఫిర్యాదు చేయగా రోజులు గడుస్తున్న చర్యలు మాత్రం శున్యం ప్రైవేట్ పాఠశాలలు పట్ల వారు వ్యవహారిస్తున్న తీరుపై కూడా పలు అనుమానాలు రికేత్తుతున్నాయి. శ్రీజన్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ కు ఈ సంఘటనపై ఫిర్యాదు చేస్తాం అని తెలుపగ మీకు నచ్చిన దగ్గర ఫిర్యాదు ఇచ్చుకోండి మండల విద్యా శాఖ అధికారికి కాకపోతే డిప్యూటీ డీఈఓ కి ఇచ్చుకోండి అంటూ ఇస్తున్న నిర్లక్ష్యపు సమాధానంతో విద్యా శాఖ అధికారులు ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి... ఏది ఏమైనా ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని విద్యార్థుల తల్లి తండ్రులు కోరుతున్నారు.

326
16774 views

Comment