అసత్య ప్రచారాల కథనాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. డాక్టర్ శ్రావణి.
నంద్యాల జిల్లా రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రావణి పై కొన్ని పత్రికలు కొన్ని యూట్యూబ్ ఛానల్ లో రుద్రవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత అలాగే గత కొన్ని రోజుల నుంచి వైద్యురాలు విధులకు రావడం లేదు అంటూ అవస్తవాలు ప్రచురించడం జరిగినదనీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు డాక్టర్ శ్రావణి తెలిపారు. వారు మాట్లాడుతూ కొందరు పాత్రికేయులు స్పష్టంగా డాక్టర్ శ్రావణి గత కొన్ని రోజుల నుంచి విధులకే హాజరు కాలేదంటూ రాయడం జరిగిందనీ, పేరు పెట్టి కథనాలు రాసి నాకు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెడ్డపేరు వచ్చేలాగా ప్రవర్తిస్తున్న సదరు పాత్రికేయులు సదరు సంస్థల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రుద్రవరం పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం నాడు కొందరు పాత్రికేయులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసారని, తెలిసి కొందరు పాత్రికేయులు మమ్మల్ని వివరణ అడగగా వారు వచ్చిన టైంలో నేను పాఠశాలలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సినేషన్ విధానాన్ని పరిశీలించడానికి వెళ్లడం జరిగిందని,సదరు పాత్రికేయులకు తెలియజేయడంతో విజ్ఞత కలిగిన పాత్రికేయులు నా వివరణతో సంతృప్తి చెంది నట్లు భావించానన్నారు. కానీ కొందరు పాత్రికేయులు నా మరియు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరును ఉద్దేశపూర్వకంగా బ్రష్టు పట్టించేలాగా వారి స్వలాభం కోసం నా మరియు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన అవాస్తవ కథనాలు ప్రచురిస్తూ, ఇష్టార్ ఇచ్చిన వివరిస్తున్న వీరిపైన వీరి యాజమాన్యం పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది అలాగే పాత్రికేయులకు ప్రత్యేకంగా తెలియజేయునది ఏమనగా సమస్యను ఆధారాలతో వార్తా కథనాలు ప్రచురించి సమాజంకి హితం అయ్యేలాగా వ్యవహరించాలని తమ స్వలాభం కోసం ఇతరుల ప్రతిష్టను భంగపరిచేలాగా ప్రవర్తించరాదని విజ్ఞప్తి చేశారు.