శ్రీ సుంకులమ్మ దేవాలయం హుండీ ఆదాయం 2,36,060 రూపాయలు.
నంద్యాల (AIMA MEDIA ): సుంకులమ్మ వీధిలో ఉన్న శ్రీ సుంకులా పరమేశ్వరీ దేవస్థానం హుండీ లెక్కింపు ఆదివారం నిర్వహించారు.దేవాలయం కమిటీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ హుండీ తెరిచి లెక్కింపు ప్రారంభించారు. హుండీ లెక్కింపు ముగిసిన తర్వాత చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి చిమ్మా నాగన్న మాట్లాడుతూ హుండీ ఆదాయం రెండు లక్షల ముప్పై ఆరు వేల అరవై రూపాయలు వచ్చిందని, దేవస్థానం బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు.దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఉగాది,కార్తీక మాసం,శివరాత్రి ప్రత్యేక పూజలు,శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం మరియు గ్రామోత్సవం నిర్వహించామన్నారు.భవిష్యత్తులో నంద్యాల పట్టణంలోని సుంకులమ్మ భక్తుల సహాయ సహకారాలతో నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.హుండీ లెక్కింపు కార్యక్రమంలో కార్యదర్శి చిమ్మా నాగన్న,ఉపాధ్యక్షులు గోపిశెట్టి వెంకట ప్రసాద్,యంచర్ల నరసింహారావు,సంయుక్త కార్యదర్శి బైగ్గారి మురళి, కోశాధికారి బైగ్గారి చిన్న ప్రసాద్, కార్యవర్గ సభ్యులు బైగ్గారి నాగ మనోజ్, బైగ్గారి సురేష్,ఓజా ప్రసాద్,ఓజా హరి,ఎం.ప్రతాప్ పాల్గొన్నారు.