logo

ఇసుక మాఫియా కి అడ్డుకట్ట వేయరా సార్...?



◆జగన్నాథ్ పూర్ లో యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా..

◆అడ్డుకోవాలని చూస్తున్న వారిని బెదిరింపుల పలు చేస్తున్న వైనం.

◆వెంపెల్లి అటవీ ప్రాంతం నుండి జగన్నాథ్ పూర్ గంగా ఇసుక తరలింపు..

◆ఓ చిన్న స్థాయి అండదండలతో అక్రమ ఇసుక రవాణా

జగిత్యాల జిల్లా : రాయికల్ మండలంలోని జగన్నాథ్ పూర్ గ్రామంలో యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా నడుస్తున్న సంబంధిత అధికారులు మాత్రం నోరు మేధపడం లేదు. మల్లాపూర్ మండలంలోని వెంపెల్లి అటవీ ప్రాంతం ద్వారా జగన్నాథ్ పూర్ గ్రామ గంగాలోకి చొరబడి ఇసుకాసురులు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఓ చిన్న స్థాయి అండదండలతో  ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని విమర్శలు సైతం ఉన్నాయి. అక్రమ ఇసుక మాఫియా కి  కొంతమంది రాజకీయ నాయకుల అస్తాం ఉందని ఎవరు అడ్డు వచ్చినా వారిని పైకి ట్రాక్టర్లను ఎక్కించండి అని మాట్లాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంపెల్లి అటవీ ప్రాంతం లోంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రెవెన్యూశాఖ గాని అటు పోలీస్ శాఖ గాని స్పందిచకపోవడం గమనార్హం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డాన్ సమయంలో వాహనాలను బయట నడప వద్దని,కరోనా మహమ్మారి బారిన పడకుండా అందరూ ఇంట్లోనే ఉండాలని పకడ్బందీ చర్యలు పోలీసు వారు చేపట్టాలని చెప్పినప్పటికీ నెంబర్ వన్ దందాగా కళ్ళముందు అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ఆ వైపు చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుకాసురులు తమ ఊరిలో నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అని వారి కళ్ళలో, ఇళ్లల్లో దుమ్ముధూళి పడి ఇబ్బందులు పడుతుమని మొరపెట్టుకున్న ఎవరు పాటించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా కి అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాలి

173
16997 views
  
206 shares