SSR బాలసంస్కార కేంద్రం ఆధ్వర్యంలో చాకలివీధిలో ఉచిత వైద్య శిబిరం
విజయనగరం జిల్లా. రాజాం.
రాజాం పట్టణంలోని చాకలివీధిలో SSR బాలసంస్కార కేంద్రం ఆధ్వర్యంలో, అమృత హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో చాకలివీధి, గొల్లవీధి ప్రాంతాలకు చెందిన సుమారు 80 మంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.
ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, సాధారణ వ్యాధులపై వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో SSR బాలసంస్కార కేంద్రం నిర్వాహకులు శెట్టి శ్రీనివాసరావు, అమృత హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ వావిలపల్లి అప్పలనాయుడు, పొట్టా సత్యన్నారాయణ గుప్తా, టంకాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.