logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మేజర్ పంచాయతీ మార్కెట్ వేళాలలో పంచాయతీకి రూ13,52,000/- ఆదాయం.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ కార్యాలయంలో శనివారం నాడు DLPO బి. రాంబాబు అధ్యక్షతన డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి, ప్రత్యేక అధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ మరియు ఇన్చార్జి ఈవో వడ్డే రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన వారపు సంత, దినసరి మార్కెట్ మరియు కబేలాల వేలం పాటలలో గతంలో పంచాయతీకి రూ13,52,000/- ఆదాయం చేకూరిందని పంచాయతీ డివిజనల్ అధికారి రాంబాబు తెలిపారు. ముందుగా పంచాయతీ నియమాలను అనుసరించి వేలంపాటదారులు డిపాజిట్ చేసి వేలాలలో పాల్గొనడం జరిగింది. మార్కెట్ వేలాలలో గత సంవత్సరం 8 లక్షల 5000 పాడగా ఈ సంవత్సరం 9,21,000 రూపాయలకు అన్నలు దాస్ చంటి వేలం పాటలో దక్కించుకున్నారని, అలాగే దినసరి వేలం పాటలలో గత సంవత్సరం 4 లక్షల 65 వేలు రూపాయలు పాడగా, ఈ సంవత్సరం రూ4,21,000 రూపాయలకి బైరి బ్రహ్మం దక్కించుకున్నారని, అలాగే కబేలాలు వేలం పాటలలో గత సంవత్సరం రూ9000/- పాడగా, ఈ సంవత్సరం కబేలాలు రూ10,000/- రూపాయలకు ముద్దాసు కర్రన్న దక్కించుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం దినసరి,వారపు సంత,కబేలా వేలాలలో రూరూ13,52,000/- గ్రామపంచాయతీకి ఆదాయం వచ్చిందని పంచాయతీ డివిజనల్ అధికారి రాంబాబు తెలిపారు. ఈ వేళాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై జయప్ప, ఏ ఎస్సై భూపాల్ రెడ్డి,పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలం పాటలో వేలంపాట దారులు తదితరులు పాల్గొన్నారు.

87
2583 views

Comment