logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

కోరుట్ల ఏప్రిల్ 5(ప్రతినిధి అల్లం, రాజేష్)

కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సామాజిక కార్యకర్తలు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ నివాసితులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ఆయన స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహానేతగా కొనియాడారు. ముఖ్యంగా పేదలు, దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
యువత ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విద్య, ఐక్యత, క్రమశిక్షణ ద్వారా ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి,దేశభక్తి గీతాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.
మొత్తంగా అంబేద్కర్ నగర్‌లో జరిగిన ఈ జయంతి వేడుకకు మున్సిపల్ కమిషనర్ అన్ని పార్టీల నాయకులు సంగ అభ్యర్థులు,వార్డు ప్రజలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా,శాంతియుత వాతావరణంలో జరిగి, స్థానికంగా మంచి స్పందనను పొందాయి.

47
1616 views

Comment