శబ్ద కాలుష్యం సృష్టించే 16 సైలెన్సర్లు జెసిబి తో ధ్వంసం చేయించిన సీఐ
శబ్ద కాలుష్యం సృష్టించే సైలెన్సర్లపై కఠినచర్యలు: సీఐ అశోక్ కుమార్
విజయనగరం జిల్లా. రాజాం:
పట్టణ పరిసర ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అనధికారికంగా మార్చిన సైలెన్సర్లను గుర్తించి ధ్వంసం చేయించారు.
ఈ సందర్భంగా సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, భారీ శబ్దాలతో తిరుగుతున్న వాహనాల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా కంపెనీ అందించిన అసలు సైలెన్సర్లనే ఉపయోగించాలని సూచించారు. మార్పులు చేసిన సైలెన్సర్లు ఉపయోగిస్తే వెంటనే తొలగించి, ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ప్రజల సౌకర్యం, శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు కొనసాగుతాయని సిఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు.