logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్యాంగ్ లీడర్

విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి విజయశాంతి నటించగా 𝟏𝟗𝟗𝟏మే𝟗 విడుదలై బాక్సాఫీస్ ను రఫ్ఫాడించిన సినిమా. చిరంజీవి ,ఆయన ఫ్యాన్స్ కు మధ్య వారధిగా నిలిచేలా " మెగాస్టార్ చిరంజీవి " అనే మాసపత్రిక నడుపుతున్న విజయబాపినీడు , సినీరచయిత సత్యమూర్తి వ్రాస్తున్న గ్యాంగ్ లీడర్ అనేసీరియల్ టైటిల్ పై మోజుపడి , చిరంజీవిని ఒప్పించి అదేటైటిల్ తో , ఫ్యాన్స్ ప్రజాభిప్రాయం తీసు కుని, వారు ఎంపికచేసిన డిజైన్ టైటిల్ తో వచ్చిన మ్యూజికల్ హిట్ ఇది.
గ్యాంగ్ లీడర్ అనే పేరు యాక్షన్ సినిమాలా ఉన్నప్పటికీ ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ ఇది.స్నేహితులతో కలసి సరదాగా అల్లరిచిల్లరగా తిరిగే నిరుద్యోగయువకుడైన హీరో విచ్చిన్నం కాబోతున్న తనకుటుంబాన్ని కాపాడుకుని , తన స్వంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడమే కథాంశం.
మధ్యతరగతియువకుడికి తగ్గట్టుగా చిరంజీవివాడిన రంగు రంగుల ,వదులుగా ఉండే పూలచొక్కాలు , ఫేడయిన జీన్స్ ప్యాంట్లు , కొన్ని యేండ్ల పాటు ఆ ట్రెండ్ కొనసాగింది. 𝟓𝟎 కేంద్రాలకు పైగా శత దినోత్సవం జరుపుకున్న వేడుకలను చిరంజీవి పుట్టినరోజు 𝟏𝟗𝟗𝟏 ఆగస్టు 𝟐𝟐 ఏకంగా తిరుపతి , విజయవాడ ,ఏలూరు,హైదరాబాద్ కేంద్రాలలో స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణిస్తూ చిరు ఒకేరోజు హాజరుకావడం అప్పట్లో అదో పెద్ద విశేషం. అప్పటి 'అప్పుల అప్పారావు'చిత్రకథలో నటిఅన్నపూర్ణది చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ పాత్ర. ఏలూరు శతదినోత్పవ బహిరంగ సభలో వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ స్వాగతించే సీన్లు కథానుగుణంగా
ఆచిత్రంలో వాడారు.....
కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం విజయబాపినీడు వహించగా...
పరుచూరి సోదరులు మాటలు రాశారు. ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ , కాంచనకు ఎక్కువ కన్నాంబకు తక్కువ లాంటి ... ఎక్కువ తక్కువ అని విలన్ రావుగోపాలరావు పలికే మాటలతో పాటు, చెయ్యిచూసావా ఎంతరఫ్ గా ఉందో ,రఫ్ఫాడించేస్తాననేడైలాగులు అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి. తర్వాత చిరంజీవి బామ్మగా నిర్మలమ్మ చీవాట్లు , శబరి అంటూ ఆమెతో సాగే కామెడీ బాగుంటుంది.
బప్పీ లహరి సంగీత సారధ్యంలో 𝐒𝐏బాలసుబ్రహ్మణ్యం 𝐊𝐃చిత్ర పాడిన వేటూరి , భువనచంద్ర వ్రాసిన పాటలు సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. టీ కొట్టు , పెండ్లి పేరంటాలు , రికార్డింగ్ డ్యాన్సులు అక్కడ ఇక్కడ అని
కాకుండా ప్రతి చోటా పాటలు మారుమ్రోగాయి...
🎼చికు చికు చేలం... పాప రీటా 🎼
🎼భద్రాచలం కొండా... సీతమ్మ వారిదండ 🎼
🎼వయసు... వయసు.. వరస అన్నది వాటం 🎼
🎼పాల బుగ్గ... ఇదిగో పట్టు.... 🎼
🎼వాన వాన... వెల్లువాయే... 🎼
🎼సండే అననురా... మండే అననురా....🎼 అంటూ సాగే పాటలకు ప్రభుదేవా , తారమాస్టర్లు చిరంజీవి-విజయశాంతి లచే వేయించిన స్టెప్పులకు థియేటర్లో అభిమానులతోపాటు ప్రతి ప్రేక్షకుడికి ఆమ్యూజిక్కు ఒక ఊపు వచ్చేలా ఉండేది.
కడప రామకృష్ణ థియేటర్లో స్ట్రైట్ గా 100 రోజులు ఆడగా , చివరి రోజున సినిమా కాకుండా కేవలం పాటలు మాత్రమే మూడుసార్లు వేయటం అదో రికార్డు . తెలుగులో హిట్ అయిన ఈ సినిమా తమిళంలో అదే పేరుతో డబ్బింగ్ కాగా హిందీలో ఆజ్ కా గూండారాజ్ అనేపేరుతో రీమేక్ అయింది.
హిందీ సినిమా పాటలు కూడా సూపర్ హిట్ కాగా వాటిని తెలుగులో లియో క్యాసెట్స్ వారు అనువాదం చేశారు....
చిరంజీవికి జతగా విజయశాంతి.........చిరంజీవి అన్నలుగా శరత్ కుమార్ మురళిమోహన్ - వదినలుగా సుమలత సుధ , బామ్మగా నిర్మలమ్మ , విలన్లుగా రావు గోపాలరావు, ఆనంద్ రాజ్ , వీరి మధ్యలో వత్తాసు పాడే కమెడియన్ గా అల్లురామలింగయ్య , 𝐒𝐏గావల్లభనేనిజనార్ధన్, హరిప్రసాద్
మహర్షి రాఘవ, జయలలిత , ప్రసాద్ బాబు, నూతన్ ప్రసాద్ ,సత్యనారాయణ,తదితరులు నటించినమ్యూజికల్ హిట్ యూట్యూబ్లో ఉంది. దాదాపుఅందరుచూసే ఉంటారు చూడనివారు , చూసినవారు కూడా పాటల కోసమైనా మరో సారి చూడవచ్చు....వీలైతే ట్రై చేయండి...

14
352 views

Comment