బాధితులను రక్షణ కల్పిస్తామన్న కుల సంఘాల నాయకులు. ఆళ్లగడ్డ జేఏసీ కమిటీ నాయకుడు కన్వీనర్ బీరువాల భాష
ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ కార్యాలయంలో, జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ ఆళ్లగడ్డ కన్వీనర్ బీరువాల భాష మాట్లాడుతూ రుద్రవరం మండలం నక్కల దీన్నే గ్రామంలో షేక్ దస్తగిరి భాష దంపతులపై అదే గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి, ధనలక్ష్మి, మద్దిలేటిరెడ్డి, తొలిసమ్మ, అంకాలమ్మ అనేవారు బాధితుల ఇంటిపక్కనే ఉంటూ వీరిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దాడికి కూడా పాల్పడుతూ కులం పేరుతో దూషిస్తు దుర్భాషలాడుతున్నారన్నారు. వీరికి న్యాయం చేయాలన్నారు పోలీసు వారికి అనేకమార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటసుబ్బయ్య, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, ఓబులేష్ B C సంఘం జిల్లా ఇన్చార్జి నరసయ్య యాదవ్ లు పాల్గొని వీరికి న్యాయం జరిగే వరకూ తాము పోరాటం చేస్తామన్నారు.