logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద నిర్వహించిన ఫుడ్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్

కామారెడ్డి ప్రతినిధి
తేదీ :03-04-2026

జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NADCP – National Animal Disease Control Programme) కింద నిర్వహించిన ఫుడ్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ కార్యక్రమము లింగంపల్లి గ్రామంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రాంప్రసాద్,సర్పంచ్ టేక్రియాల్ లావణ్య- రమేష్ ,ఉపసర్పంచ్ ఎడ్ల గంగారం, డైరీ ప్రెసిడెంట్ చిన్న బీర కిషన్ రావు పాల్గొనారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD) పశువులలో వేగంగా వ్యాపించే వైరల్ వ్యాధి అని, దీని వలన పాలు తగ్గడం, పెరుగుదల తగ్గడం, వంటి సమస్యలు రావడం వలన రైతులకు భారీ ఆర్థిక నష్టం కలుగుతుందని తెలిపారు. ఈ వ్యాధిని నిర్మూలించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం NADCP కార్యక్రమాన్ని అమలు చేస్తోంది అని పేర్కొన్నారు.ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం FMD టీకా కార్యక్రమం 8వ దశ (8th Round) లో భాగంగా చేపట్టబడింది.ఈ శిబిరంలో సుమారు 275 పశువులకు FMD టీకాలు ఇవ్వబడినవి. టీకాలు వేసిన ప్రతి పశువు వివరాలు
NDLM (National Digital Livestock Mission) – భారత్ పశుధన్ (Bharat Pashudhan) యాప్ ద్వారా నమోదు చేయబడినవి.అలాగే పశువుల యజమానుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు OTP పంపించి ధృవీకరణ ప్రక్రియ పూర్తిచేయబడింది, తద్వారా డేటా నమోదు పారదర్శకంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది ఎల్ ఎస్ ఏ అహల్య, ,గోపాల మిత్రులు ,కాశిరెడ్డి,మురళీ,రాజేశ్వర్ పాల్గొన్నారు

22
1656 views

Comment