logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా అలై కటుకం రాజేంద్రప్రసాద్.ADVOCATE

అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా అలై కటుకం రాజేంద్రప్రసాద్
కోరుట్ల ఏప్రిల్ 3 : అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ , జైపూర్ రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన సందర్భంగా 2026-2027 అలయనిస్టిక్ సంవత్సరమునకు గాను ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా కోరుట్ల కు చెందిన సామాజిక సేవకులు, ప్రముఖ సీనియర్ న్యాయవాది అలై కటుకం రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎన్నికల అధికారి మరియు ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ అలై. అవినాష్ చంద్ర ఒరి జీ ప్రకటించారు.
ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ శాస్త్రి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అలై .కటుకం రాజేంద్రప్రసాద్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా అలై. కటుకం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ అలై బి. తిరుపతి రాజు , అంతర్జాతీయ అధ్యక్షులు బాలా జీ శాస్త్రి లకు కృతజ్ఞతలు తెలుపుతూ అలయన్స్ లీడర్స్ కు , సభ్యులకు అందుబాటులో ఉంటూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరింత సేవ కార్యక్రమాలు నిర్వహింప జేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు.
అలై కటుకం రాజేంద్రప్రసాద్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయవాదులు డి.వేణు కుమార్, అవధూత రజనీకాంత్, గోనె రాజేష్ ఖన్నా, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు కటకం సురేందర్, బండ్ల గజానందo, పాత రవీందర్, కటుకం జగదీష్, అడ్లగట్ల సత్యనారాయణ, చాట్ల మహేష్, పేడిమల్ల రాజు, గోనె శ్రీహరి, కైరంకొండ రాజ గంగాధర్ తదితరులు అభినందించారు

5
201 views

Comment