logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డ కోటలో మారుతున్న రాజకీయం. ఏవీ సుబ్బారెడ్డి - జనసేన కాంబినేషన్ కుదిరినట్లేనా?

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఇకపై రాజధానిని మార్చటం ఎవరి తరం కాదని రాష్ట్ర విత్తనాభి సమస్త మాజీ చైర్మన్, ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి ప్లాజా ఆవరణంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం పొందిన సంతోషంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న పార్లమెంటులో బిల్ ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.దాదాపు ఏడు సంవత్సరాలుగా మన రాష్ట్రనికి రాజధాని లేకుండా ఉండటం ఆవేదన కలిగించిందని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ల చొరవతో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎవరు మార్చలేని విధంగా పార్లమెంటులో బిల్లును ఆమోదం చేయించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రి లోకేష్ బాబుకు,ప్రధాని మోదీ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కు ఏవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రానున్న రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేన, బిజెపి పార్టీ నాయకులను కలుపుకొని వెళతానని ఏవి స్పష్టం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది సూర్య నారాయణరెడ్డి, ది నంద్యాల కమ్యూనికేషన్ కేబుల్ ఛానల్ మేనేజర్ ధనుంజయ రెడ్డి, టిడిపి నాయకులు , కార్యకర్తలు, ఏవీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

452
11747 views

Comment