logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జ్యోతి,కొత్త రేషన్ కార్డు లు,కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

గ్రామసభల ద్వారా గ్రామంలోని సమస్యలను గుర్తించి,పరిష్కరించడం జరుగుతుంది

ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

అక్కంపేట గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతా

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు

గురువారం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీ ముద్దం సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... ప్రజాపాలన-ప్రజా ప్రభుత్వం మనది అని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా ప్రభుత్వం 99 రోజుల ప్రజా ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపడుతుందని అన్నారు.ప్రో జయశంకర్ సార్ గారి స్వస్థలమైన అక్కంపేట గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేశామన్నారు.గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల విజయానికి ప్రజల సహకారం అవసరం అని, ప్రతి పౌరుడు పాలనలో భాగస్వామి కావాలని అన్నారు.అక్కంపేట గ్రామానికి రూ 15 కోట్ల పైగా సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు.అలాగే మహిళా సంక్షేమ మరియు ఆర్థిక అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళల కోసం మహిళల ద్వారాఇందిరా పరకాల మహిళా డైరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం నూతనంగా 5 ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రారంభించబోతున్నదని అన్నారు.అందులో ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీం ద్వారా పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. కుటుంబంలో ఇంటి పెద్ద ఆకస్మిక మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా 5 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం భోజనం పథకం ఇంటర్మీడియట్ విద్య వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటార్రైజ్డ్ వాహనాలు అందిస్తామన్నారు. పంటల వైవిధ్యకరణ, ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేస్తామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,500 రూ గ్యాస్ సిలిండర్,సన్న వడ్లకు బోనస్,గృహ జ్యోతి,కొత్త రేషన్ కార్డు లు,కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎండి వాజిద్ అలీ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

1
0 views

Comment