logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కామ్రే అనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం – కార్యక్రమంలో పాల్గొన్న సుగుణక్క

*ప్రెస్ రిలీజ్*
*తేదీ: 02-04-2026*

*🔹 జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కామ్రే అనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం – కార్యక్రమంలో పాల్గొన్న సుగుణక్క*

ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన కామ్రే అనిల్ కుమార్ గురువారం జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకుల మంగ, మాజీ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసి, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం అనిల్ కుమార్‌ను శాలువాతో సన్మానించారు.అనిల్ కుమార్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా గ్రంథాలయ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

*డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్*

0
0 views

Comment