logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం: చంద్రబాబు హర్షం. గ్రామాల్లో దీపావళి జ్యోతులా ఉత్సవం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందం వ్యక్తం చేశారు. చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం కోవ్వూరు గ్రామంలో ఈ సందర్భంగా దీపావళి పండుగలా జ్యోతులు వెలిగించి ఉత్సవాలు జరిగాయి.
ఈ చారిత్రక బిల్లు ఆమోదంతో ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణం. ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "అమరావతి ప్రస్థానంలో ప్రతీ అడుగులో ప్రధాని అండగా నిలిచారు. 2015లో రాజధాని శంకుస్థాపన, 2025లో పునర్నిర్మాణం.. మోదీ చేతుల మీదుగానే జరిగింది" అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా పూర్తిగా సహకరించారు. పార్లమెంటులో ఈ బిల్లుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం అమరావతి రైతులకు అంకితమని, వారి త్యాగం, పట్టుదల మరువలేనివని చెప్పారు.
ఇక అమరావతి ఆంధ్రులకు ఏకైక ప్రజా రాజధాని. రాజధానిపై ఎలాంటి అనుమానాలు, చర్చలు ఉండవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చీకటి రోజులకు ముగింపు పడింది. ఏపీ ప్రగతికి కొత్త నాంది. "ఏపీకి గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్. దేశానికీ అద్వితీయమైన భవిష్యత్ నగరంగా నిలుస్తుంది" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతి సుస్థిరతతో నూతన శకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి కాంతమ్మ మండల ఐటీడీపీ ప్రెసిడెంట్ బంటు రాజు. గ్రామంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొన్నారు

0
100 views

Comment