logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాట ఇస్తే మడమ తిప్పని జనసేన.ఆళ్లగడ్డ బాధితులకు అండగా నిలిచిన ఇరిగెల బ్రదర్స్.

AIMA న్యూస్. నంద్యాల జిల్లా
జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడంలో ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇరిగెల బ్రదర్స్ (రాంపుల్లారెడ్డి సోదరులు) మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో ఆళ్లగడ్డ మండల పరిధిలోని బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.మండలంలోని ఎస్. లింగందిన్నె గ్రామానికి చెందిన బండి యోన, పేరాయిపల్లె గ్రామానికి చెందిన ఎల్లాల దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఈ ఆర్థిక సహాయాన్ని రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్, రాష్ట్ర నాయకులు తాళ్లూరి రామ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే కార్యకర్తలే జనసేనకు అసలైన బలం. ప్రమాదవశాత్తు ఏ కార్యకర్త కుటుంబానికైనా ఆపద వస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. అందులో భాగంగానే ఈ బీమా చెక్కులను అందజేయడం జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రతి జనసైనికుడికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని పేర్కొన్నారు.
తమ కష్టకాలంలో స్పందించి, రూ. 5 లక్షల బీమా అందేలా కృషి చేసిన పవన్ కళ్యాణ్ కు, నిరంతరం వెన్నంటి ఉంటున్న ఇరిగెల బ్రదర్స్ కు బాధిత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సాయం తమ జీవితాలకు కొండంత భరోసానిచ్చిందని వారు పేర్కొన్నారు.

97
2943 views

Comment