logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నివాళి

కామారెడ్డి ప్రతినిధి
తేది :02.04.2026

కామారెడ్డి జిల్లా గురువారం.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం అని ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం” అని కొనియాడారు. . సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్ జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ , సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్ , గౌడ కుల సంఘ నాయకులు రాజా గౌడ్, వెంకట్ గౌడ్, స్వామి, శాంతయ్య, అశ్వక్, నరేష్, జీవన్, స్వప్న, సునీత, బీసీ సంఘం నాయకులు నాగరాజు, ఇతర గౌడ సంఘ నాయకులు, జిల్లా అధికారులు , పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

11
836 views

Comment