కార్పొరేటర్ పడాల ఆకాంక్ష ఆధ్వర్యంలో గ్రామసభ
ప్రజల సమస్యలు వింటూ పలు అంశాలపై తీర్మానం
కొత్తగూడెం ఏప్రిల్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్) కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం శాసనసభ్యులు కునంనేని సాంబశివరావు ఆదేశాల మేరకు గురువారం 11వ డివిజన్ పాత కొత్తగూడెం లో స్థానిక కార్పొరేటర్ ఆకాంక్ష పడాల ఆధ్వర్యంలో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది.ఈ సభను తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించి గత రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచిన సందేశాన్ని వివరించి, స్థానిక ప్రజలచే అభిప్రాయాలు,వార్డ్ సమస్యలను చర్చించి పలు అంశాలను తీర్మానించి మినిట్స్ బుక్ లో రాసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రవి కుమార్ , వార్డ్ ఆఫీసర్ ఎన్ రవి , ఆర్ పి అనురాధ , డివిజన్ పెద్దలు పడాల భవాని ప్రసాద్, మహిళలు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.