బాధిత కుటుంబానికి అండగా ఉంటాం - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*
*కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కు అందజేత*
*పత్రిక ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
ఏప్రిల్ 2 :-
*
*జనవరి 5న గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్.*
*ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు.*
*కార్పస్ ఫండ్ లో లక్ష రూపాయల చెక్కు భార్య జ్యోతి కి అందజేత.*
బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఈ సంవత్సరం జనవరి 5న ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్నటువంటి 2012 బ్యాచ్ కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(35) గుండెపోటు రావడంతో పరమపదించడం జరిగింది. స్వర్గస్తులైన కానిస్టేబుల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక సహాయంలో భాగంగా ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయం నందు రాథోడ్ విలాస్ కుటుంబ సభ్యులైన భార్య జ్యోతి మరియు అన్నయ్య కైలాష్ లకు జిల్లా పోలీసులు ముఖ్య కార్యాలయం నుండి కార్పస్ ఫండ్ కింద వచ్చిన లక్ష రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. కానిస్టేబుల్ మరణం పోలీసు వ్యవస్థకు తీరని లోటుని, బాధిత కుటుంబ సభ్యులకు పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటూ అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా రావలసిన ప్రతి ఒక్క లబ్ధి త్వరగా చేకూర్చేలా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ సులోచన, సీసీ కొండ రాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.