ఇది వెస్టు బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి.
ఇది వెస్టు బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి.
ఇతని పేరు వెంకటేష్ గౌడ్ వయస్సు 28 సవత్సరాలు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ఏబీవీపీ
ఇంచార్జ్ గా ఉన్నాడు. ఇతని సొంత ఊరు గుంటూరు.
ఇంతవరకు విశేషం లేదు కానీ.. నిన్న ఇతనితో మాటల సారాంశం ఈ పోస్ట్....
అక్కడ(వెస్ట్ బెంగాల్) ఎబివిపి పని చేయటం అంటే.. అసిధార వ్రతమని చెప్పాలి. మమతా ఖాన్ చెంచా గిరి చేసే ఊర కుక్కలు ఇతనిని కొట్టి, కర్రలతో, రాళ్లతో చితక బాది , చనిపోయాడని అనుకోని రైలు కట్టమీద పడేసి వెళ్లారు. రక్తమొడుతు కార్యాలయానికి చేరుకున్నారు. కేసు పెట్టటానికి సహచర abvp వారు వెళితే.. కేసు పెట్టినందుకు మళ్లీ వారిని కూడా కొట్టారు. ఎక్కడో కాదు పోలీస్ త్థనా ముందరే. లోపలకి పోయి వాళ్ళు కొడుతున్నారు అంటే.. కాసేపు పోలీస్ వారు లోపలే కూర్చోపెట్టి తరువాత ఇద్దరు కానిస్టేబుల్స్ ని ఇచ్చి ఎబివిపి కార్యకర్తలను కార్యాలయం వద్ద విడిచి పెట్టామన్నారు. ఇదీ బెంగాల్ పరిస్థితి.
మరి మీరు కౌంటర్ ఇవ్వలేదా అని అడిగితే.. వెంకటేష్ చెప్పిన అంశాలు మీకోసం...!
హా... కౌంటర్ ఇస్తే ఇచ్చిన వారి శవం కూడా దొరకదు..
సాక్షాత్తు భాజపా ఎంపీ లు ఇద్దరినీ ఇలానే రోడ్డు మీదే కొట్టారు. కౌంటర్ ఇచ్చే స్థాయిలో ప్రస్తుతం భాజపా కానీ సంఘ్ పరివార్ కానీ, అక్కడ ప్రస్తుతం లేవు. ఖండ, ప్రాంత, క్షేత్ర ప్రచారకుల మీద కూడా అడపాదడపా భౌతిక దాడులు చేస్తూనే ఉంటారు. కమ్యునిస్ట్ ప్రభుత్వాలు ఏదైతే నేర్పాయి అదే ఇప్పుడు మమత చేస్తోంది. మమతను కూడా కమ్యునిస్ట్ హయాంలో మూడు సార్లు కొట్టారు కదా...
దెబ్బలు తీసుకోవాలి. ఆ దెబ్బల వలన ప్రజల సింపతీ తో గెలిస్తే అంతవరకూ సంతోష పడటమే.
మమత ఇంటి దగ్గరే రెడ్ లైట్ ఏరియా ఉంటుంది.
కాళీ ఘాట్ అంతా వ్యభిచారం నడుస్తూ ఉంటుంది.
వివేకానందుని ఇంటివద్దే గోవధ జరుగుతూ ఉంటుంది. VHP కార్యాలయం మీద 2 సార్లు దాడి చేసి తగలబెట్టారు. సంఘ్ కార్యాలయాన్ని అలాగే చేశారు. అది చెప్పుకోవటానికి భారత భూభాగం.
కానీ పరిస్థి ప్రకారం అక్కడి వాతావరణం ప్రకారంగా అది మరో బంగ్లాదేశ్. భాజపా ఏ రాష్ట్రం లో గెలిచినా, భాజపా అధిష్టానం సున్నితమైన అంశాలమీద స్టేట్ మెంట్ ఇచ్చినా మాకు ఇక్కడ సమరమే. Fb లో ఒక్క పోస్ట్ షేర్ చేసినా అక్కడి లోకల్ తృణమూల్ కాంగ్రెస్ వాళ్లు ఇంటికి వచ్చేస్తారు.
ఇవన్నీ మీడియా చూపదు. ఎందుకంటే మీడియా అంతా కమ్యునిస్ట్ వాళ్ళది.
ఇదీ అక్కడ పరిస్థితి. తన్నులు తింటూ పని చేయాలి. పనిచేస్తూ తన్నులు తినాలి. ఇక్కడ ఆరాంగా.. తింటూ, హాయిగా తిరుగుతూ.. నాలుగు జెండాలు కట్టి, నాలుగు వాల్పొస్తార్లు అంటించి.. పార్టీ పని చేసేసాం కానీ పార్టీ మాకు ఏమి ఇచ్చింది... అని నీలిగే వారికి ఈపొస్ట్ అంకితం.!
అక్కడ ప్రాణాలతో చెలగాటం. అది మృత్యు కుహరం. బ్రతికి ఉంటే కార్య విస్తరణ కోసం పనిచేయటం, లేకపోతే శవం అయ్యి ఇంటికి రావడం. అదీకూడా కన్న తల్లి తండ్రికి అఖరు చూపు అయినా చూసుకొనే భాగ్యం ఉంటేనే.
లేకపోతే ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు.
ఇలా వివిధ క్షేత్ర ( సంఘ్ పరివార, మరియు దాని అనుబంధ సంస్థలు) కార్యకర్తల మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి. మిస్సింగ్ అని పోలీస్ రికార్డ్ లో వచ్చింది అంటే.. ఆ కార్యకర్త చనిపోయినాడు అని.
ఇప్పుడు చెప్పండి... పార్టీ నాకేమీ ఇచ్చింది..? అని అందామా.. పార్టీ కి నేను ఇతని స్థాయిలో, ఇలాంటి ఎందరో కార్యకర్తల స్థాయిలో ఏమైనా ఇప్పటివరకు ఇచ్చానా? ఇక మీదట ఇవ్వగలనా?
అని అనుకుందామ? నిజంగా ఇలాంటి వారు ధర్మం కోసం పుడతారు. ఇలాంటి వారు ఎందరో సమిధలు అయితే.. మరెందరి రక్తం చమురు అయ్యి, అసువులు అర్పిస్తే మన ధర్మ జ్యోతి ఆరకుండా వెలుగుతూ ఉంది. అతనితో మాట్లాడుతుంటే నా నోట మాటే లేదు. నిట్టూర్పులు తప్ప.
సేకరణ