logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పీఆర్సీ,ఐ.ఆర్,డి.ఏ బకాయిలు,మెమో 57 అమలు,పెన్షనర్లు బకాయి లు కొరకై నిరహార దీక్షలు: యూటీఎఫ్.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షను ప్రారంభించిన యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా.ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 11 వ పిఆర్సి బకాయిలు, ఈ ప్రభుత్వంలో చెల్లించాల్సిన నాలుగు డీఏ లు మంజూరు, పేరుకుపోయిన 30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించడంలో వ్యవహరించిన తీరు వలన రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర నష్టా లకు గురికావాల్సి వచ్చింది అనే యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా అన్నారు. గత ప్రభు త్వంలో అనేక పోరాటాలు చేసి పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని, ఈ ప్రభుత్వంలో అయినా 12వ పిఆర్సిని, పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ లను, మెమో 57 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు పి.వి.ప్రసాద్,జె.సుధాకర్ లు మాట్లాడుతూ ఇప్పటి కైన ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షం లో రాష్ట్ర కేంద్రం లో ఏప్రిల్ 25 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిరహా ర దీక్షలు చేపడతామని హెచ్చరించారు.ఈ క్రమంలో రాష్ట్ర కౌన్సిలర్లు ఐజయ్య, సుజాత,జిల్లా గౌరవ అధ్యక్షుడు సుబ్బరాయుడు, సహాధ్యక్షుడు సత్య ప్రకాష్ గారు, జిల్లా కార్యదర్శి కిషోర్, రామ కృష్ణుడు, లతీఫ్,ముర్తు జావలి, నాగ చెన్నమ్మ, నరసింహా రెడ్డి,అరవింద్ కుమార్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

0
461 views

Comment