(పారాక్వాట్ గడ్డిమందు నిషేధం)
విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడినది.
ఏప్రిల్ 01( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
పారాక్వాట్ గడ్డిమందు నిషేధం
*విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడినది. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలెను,
*పారాక్వాట్ గడ్డిమందు నిషేధం*
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పారాక్వాట్ (Paraquat) గడ్డిమందు పై నిషేధం విధించిన విషయం తెలియ జేయబడుచున్నది.
ఈ నిషేధం 31 మార్చి 2026 నుండి అమల్లోకి వచ్చినది.
పారాక్వాట్ అధిక విష తత్వం కలిగిన రసాయనం కావున ఈ నిర్ణయం తీసుకో బడినది.రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్ట బడినవి.
నిషేధ కాలంలో విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించ బడినది.
డీలర్లు, డిస్ట్రి బ్యూటర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలెను.ఉల్లంఘనలకు చట్టపరమైన చర్యలు తీసుకో బడును.రైతులు సురక్షిత ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతులను అనుసరించ వలెను.