ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్.....
కామారెడ్డి ప్రతినిధి
తేదీ:01-04-2026
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్.....
క్రీడలు,సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విశేష పతకాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* అభినందించారు.
గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యకథాన్ లో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, క్రీడాకారులు,స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. *యువతలో సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని* అన్నారు. క్రీడల్లో పనితీరు,మెరుగుదల,శిక్షణ విధానాలు,ఫ్యాన్ ఎంగేజ్ మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులకు ఈ ఆవిష్కరణలు బాట వేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గెలుపొందిన షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు అవని రెడ్డి మరియు ఆరాధ్య రెడ్డి *గోల్డ్ మెడల్* అండర్ 17 గర్ల్స్ డబుల్స్,2k రన్ మరియు కరాటె లో ధనుష్ కుమార్ అండర్ 14 లో *గోల్డ్ మెడల్*, శ్రీ వెంకట్ *సిల్వర్ మెడల్* అండర్ 9 boys సింగిల్స్,*జై ప్రీత్ మరియు జిశాన్ కాంస్య పతకం* అండర్ 13 boys డబుల్స్,*విష్ణు మరియు నియాన్ కాంస్య పతకం* అండర్ 15 boys డబుల్స్,చేతన *కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ సింగిల్స్,*అక్షర మరియు చేతన కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ డబుల్స్ లో విజయం సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు.
అంతే కాకుండా జిల్లాలో క్రీడాకారులను వెలికి తీసి వారిని స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన (TITA) *తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్* నీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు పాల్గొన్నారు.