నిరుద్యోగులకు ఏప్రిల్ ఫూల్ చేసిన కూటమి సర్కార్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారు ప్రభుత్వ ఏర్పడి 25 నెలలు కావస్తున్నప్పటికీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రాష్ట్రంలోని యువకులు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తామని అందరికీ ఉద్యోగం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటివరకు జాబ్ మేళాకు సంబంధించి క్యాలెండర్ను విడుదల చేయకపోవడం ఉన్నత విద్యను అభ్యసించిన వేలాదిమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అటు విద్యార్థులు నిరుద్యోగులు ఒకటై విద్యార్థి యువజన ఐక్య సంఘం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు ఇందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో వైయస్సార్ ఎస్ యు జిల్లా నాయకులు పురుషోత్తం రాయల్. అమర్నాథ్ రెడ్డి. పట్టణ అధ్యక్షుడు వాల్మీకి విష్ణు. పిఆర్ఎస్ వైఫ్ జిల్లా అధ్యక్షుడు సాయినాథ్ రెడ్డి.ఏఐయుఎస్ఓ జిల్లా అధ్యక్షుడు దామోదర్ ఆంబేధ్కర్ విగ్రహం ఎదుట ఉదయం 11 గంటలకు ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని దాదాపు 2.30 లక్షల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని అలాగే పోలీసు డిపార్ట్మెంట్లో 19 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేయడానికి మెగా జాబ్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు
తమ డిమాండ్లు అమలు అయ్యేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా దఫా దఫాలుగా ఆందోళన చేస్తామని కూటమి సర్కార్ నిజ రూపాన్ని ప్రజల ఎదుట నిలుపుతామని వారు తెలిపారు.