logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి

శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు.

✅ ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా ఘటనల్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ (ట్యాంక్ బండ్) లో పడిన ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడారు. అయితే, కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి గారు స్పందించారు.

✅ శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివ కుటుంబం ముఖ్యమంత్రి గారిని కలిశారు.

✅ ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్‌ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

✅ సహృదయంతో స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబ సభ్యులు అన్నారు.

0
0 views

Comment