logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన మూడ్ గణేష్‌కు ఘన సన్మానం... కొత్తగూడెం కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధికి నూతన పాలకమండలి శక్తివంచన లేకుండా కృషి చేయాలి

​కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన మూడ్ గణేష్‌కు ఘన సన్మానం
కొత్తగూడెం కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధికి నూతన పాలకమండలి శక్తివంచన లేకుండా కృషి చేయాలి
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగాలి
సమిష్టి కృషితోనే నగర రూపురేఖలు మారుతాయి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా

​కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్‌గా నూతనంగా ఎన్నికైన మూడ్ గణేష్‌ను సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. పట్టణంలోని లక్ష్మీదేవిపల్లి మండలం, లోతువాగు సమీపంలో గల ఎస్సార్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్‌ను సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ...కొత్తగూడెం కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధికి నూతన పాలకమండలి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు సాగాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాహిత పాలన అందించాలని సూచించారు. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలోని మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, రహదారుల వంటి నిత్యవసర సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని మేయర్‌కు విజ్ఞప్తి చేశారు. ​సమిష్టి కృషితోనే నగర రూపురేఖలు మారుతాయని, పార్టీలకతీతంగా అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందేలా చూడాలని ఆయన కోరారు. అవినీతి రహిత పాలనతో కొత్తగూడెం కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. ​సన్మాన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వర రావు, మిరియాల రంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కే సారయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, ఎస్టి సలీం, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, జి వీరస్వామి, వాసిరెడ్డి మురళీ, మువ్వా వెంకటేశ్వరరావు, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, అడుసుమిల్లి సాయిబాబా, ఎస్ కే ఫహీం, డి శంకర్, బంధం నాగయ్య, మండల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

12
30 views

Comment