*చాందా-టి గ్రామంలో ‘సాయి వినాయక ఇండస్ట్రీస్’ ప్రారంభం*
పత్రికా ప్రకటన
మార్చి 31, 2026 –ఆదిలాబాద్
*PMEGP పథకం కింద యూనిట్‌ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా*
ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందా-టి గ్రామంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం (PMEGP) కింద ఏర్పాటు చేసిన ‘సాయి వినాయక ఇండస్ట్రీస్’ యూనిట్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రిబ్బన్ కత్తిరించి పరిశ్రమను అధికారికంగా ప్రారంభించారు.
పారిశ్రామికవేత్త రాజ్ కుమార్ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ యూనిట్‌కు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రామ్‌నగర్ శాఖ ఆర్థిక సహాయం అందించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. PMEGP వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. యువత ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీజీబీ బ్రాంచ్ మేనేజర్ మధుసుధన్, సీనియర్ మేనేజర్అరుణ్ కుమార్, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.