యుద్ధంతో సమిదలవుతున్న అమాయకులు..
పెను ప్రమాదంగా మారిన అమెరికా సామ్రాజ్యవాద పోకడలు..
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా
నరమేదం జరుగుతన్నా మోడి నోరు మెదపరెందుకో
సహజ వనరులు దోచుకునేందుకు మావోయిస్టులపై దాడులు
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలి
ప్రజా పోరాటాలే కమ్యూనిస్టు పార్టీకి అజెండా కావాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా
లక్ష్మీదేవిపల్లి మార్చ్ 31( ) :అమెరికా సామ్రాజ్యవాద యుద్ధ పోకడలు ప్రపంచ శాంతికి పెనుప్రమాదంగా మారుతోందని, ఈ యుద్ధం భారీ ప్రాణ నష్టానికి, ప్రాంతీయ అస్థిరత్వానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నానికి దారితీసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా అన్నారు. లక్ష్మీ దేవిపల్లి మండలం లోతువాగు ఎస్ఆర్ గార్డెన్స్ లో మంగళవారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై ఏక పక్ష యుద్ధం చేస్తున్నాయని, దీని వల్ల అమయాకులు సమిదలవుతున్నారని, సుమారు 3300 మందిని పొట్టన పెట్టుకున్నారని, పసి పిల్లలను కూడా వదల్లేదని మండిపడ్డారు. ఈ నరమేదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసం ఉందన్నారు. భారతదేశ నౌకాదళం పై దాడి జరిగినప్పటికీ, దేశంలో యుద్ధం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నప్పటికీ దేశ ప్రధాని నరేంద్రమోడి కనీసం నోరుమెదపక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. విదేశాంగ విధానానికి కట్టుబడ్డ మోడి మానవీయ కోణాన్ని మరిచారని చెప్పారు. అమెరికా ప్రక్కనే ఉన్న క్యూబాపై కూడా కత్తికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ కారణంగా దేశంలో పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయని, ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలతో పాటు ఇతర నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ అగార్ పేరుతో 3 వేల మంది మావోయిస్టులను ప్రభుత్వం హతమార్చిందని, కేంద్ర పోకడల కారణంగా అనేక మంది లొంగి పోతున్నారని చెప్పారు. చర్చలకు రానివ్వకుండా మారణహోమం సృష్టిస్తూ భయానక వాతావరణాన్ని కల్పించారని చెప్పారు. మావోయిస్టు రహిత భారతాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా సత్ఫలితాలు సాధించామంటూ చెప్పుకుంటుందని అన్నారు. అడవుల్లో నిక్షిప్తమైన ఉన్న సహజ వనరులను దోచుకునేందుకు కేంద్రం మావోయిస్టులను అడవుల నుండి బయటకు పంపుతోందని, అదానీ, అంబానీలకు అక్కడి సంపదను కారు చౌకగా కట్టబెట్టేందుకు బిజిపి చూస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వల పనితీరుపై ప్రశించే వారిని అర్బన్ నక్సలైట్లు అంటూ ముద్రవేసి వేదింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే పెను ప్రమాదం ముంచుకొస్తోండని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు, రైతు రుణ మాఫీ తూతూ మంత్రంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థను ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని, కార్మికుల హక్కులను కాలరాస్తూ ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సేవ్ సింగరేణి పేరుతో సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయ వంతమైందని, దీంతో ప్రభుత్వానికి తమ సత్తా ఎంటోచాటామని తెలిపారు. సింగరేణి కార్మికుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. రాజకీయ సయోధ్యకు తాము కట్టుబడే ఉన్నామని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసేందుకు వెనుకంజ వేసేదే లేదని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, జర్నలిస్టుల సమస్యలపై శాసన సభ్యలు కూనంనేని సాంబశివరావు తన గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తున్నారని, చట్ట సభల్లో మన ప్రాతినిధ్యం పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగి తమ సత్త ఎంటో చాటామని, కమ్యూనిస్టులను తక్కువ చేసి చూసిన, మాట్లాడిన వాళ్ల నోళ్లు ఎల్లబెట్టుకునే ఫలితాలు సమిష్టిగా రాబట్టడ గలిగామన్నారు. రానున్న జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ఇదే స్పూర్తిని కొనసాగిద్దామని తెలిపారు. జి వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వర రావు, మిరియాల రంగయ్య, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్'తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు కే సారయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, ఎస్టి సలీం, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళీ, మువ్వా వెంకటేశ్వరరావు, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, అడుసుమిల్లి సాయిబాబా,ఎస్ కే ఫహీం, డి శంకర్, బంధం నాగయ్య, మండల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.