logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*▪️హిరమండలం మండలంల సర్పంచుల పదవీకాల ముగింపు సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు

AIMA news :
*▪️పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో హిరమండలం మండలం ఎంపీపీ తూలుగు మేనక గారి అధ్యక్షతన నిర్వహించిన 23 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీ కాల ముగింపు సభకు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం సర్పంచుల పరిపాలన విధానం,గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి, వారి కృషిని ప్రశంసించారు.గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, మెమొంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో హిరమండలం మండల అధ్యక్షులు దారపు డిల్లేశ్వరరావు గారు,ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతి రావు గారు, జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు గారు, హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు,సర్పంచు ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.*

15
581 views

Comment