మత్తు వ్యసనాల నుండి విముక్తి కల్పించడమే లక్ష్యం.
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 31 :-
మత్తు పదార్థాల బానిసల చికిత్సకు ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ కేంద్రం పరిశీలన
గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్న డవ్ (డి-అడిక్షన్) కేంద్రం.
చికిత్సా విధానాలు, సదుపాయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం తో పాటు, వాటికి బానిసైన వ్యక్తులను సాధారణ జీవితంలోకి తీసుకురావడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక రిమ్స్ ప్రాంగణంలో గల డవ్ డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న చికిత్సా విధానాలు, సౌకర్యాలను పరిశీలించారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులకు వైద్య సలహాలు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తూ వారిని ఆరోగ్యవంతమైన జీవన విధానంలోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు, యువత తీవ్రంగా ప్రభావితమవుతున్నందున ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులను దూరం చేయడానికి కుటుంబ సభ్యులు, సమాజం సహకారం అవసరమని, అలాంటి వారిని డి-అడిక్షన్ కేంద్రాలకు తీసుకువచ్చి చికిత్స చేయించాలన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు కె నాగరాజు, కె స్వామి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.