logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎస్‌ఎన్‌పీసీ జూనియర్ ఇన్స్పెక్టర్ గౌస్ పదవీ విరమణ ముఖ్యఅతిథిగా పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్



సింగరేణి ఎస్‌ఎన్‌పీసీ డిపార్ట్మెంట్‌లో జూనియర్ ఇన్స్పెక్టర్‌గా పదవి విరమణ పొందిన గౌస్ కి ఘనంగా, భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన bఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష చేతుల మీదుగా, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫంక్షన్ కమిటీ టెంపుల్ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గౌస్ సేవలను కొనియాడారు. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, అందరితో కలిసిమెలిసి పనిచేసిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమం ఎంతో భావోద్వేగంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ జే. రాంబాబు, జూనియర్ ఇన్స్పెక్టర్ కామరాజు , జమేదార్లు కమల్ సింగ్ , జయరాజు, వై. శ్రీనివాస్ , సీనియర్ గార్డ్స్‌గా ఆర్. హనోక్ రాజ్, జనార్దన్ రావు, మల్లికార్జున్, సుధాకర్, గౌస్, వి. సురేష్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ సుంకరి శ్రీనివాస్, ఈశ్వర్, నూకరాజు తదితరులు, అలాగే తోటి గార్డ్స్, డ్రైవర్లు బంధుమిత్రులు పాల్గొన్నారు.చివరిగా అందరూ కలిసి గౌస్ భవిష్యత్తు జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

27
514 views

Comment