పదవీ విరమణ అనంతరం ఆరోగ్యం పై దృష్టి సారించాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*
*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 31 :-
*
*పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ.*
*సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ పొందిన సర్కిల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్.*
*అధికారులకు దంపతులతో సహా సత్కారం.*
*అధికారుల ప్రశంసలు, మన్ననలు పొంది సర్వీస్ నందు ఎలాంటి రిమార్కులు లేకుండా రిటైర్మెంట్.*
*సిబ్బంది పోలీసు వ్యవస్థకు చేసిన సేవలు మరువలేనివి*
*పదవి విరమణ పొందిన అధికారులు.*
1) జాదవ్ గుణవంత్ రావ్ (సర్కిల్ ఇన్స్పెక్టర్, డిసిఆర్బి)
2) జాదవ్ లింభాజీ నాయక్,(ఏఎస్ఐ, మావల పోలీస్ స్టేషన్.)
పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. పదవీ విరమణ పొందిన ఇరువురు అధికారులకు జిల్లా ముఖ్య కార్యాలయానికి ఆహ్వానించి కుటుంబ సభ్యుల సమక్షంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని శాలువా పూలమాలతో సత్కరించి, బహుమతి ప్రధానం చేసి సన్మానించారు. ఉద్యోగం నందు భర్త ఎలాంటి చింతలు లేకుండా విధులు నిర్వర్తించాలంటే భార్య సహకారం ఎంతగానో ఉంటుందని, భార్యాభర్తలు ఇద్దరిని సత్కరించడం జరిగింది. ఇరువురు అధికారులు సుదీర్ఘకాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి ఈరోజు పదవి విరమణ పొందడంతో వారు చేసిన సేవలను పోలీసు వ్యవస్థ చిరకాలం గుర్తించుకుంటుంది అన్నారు. సంఘవిద్రోహశక్తులతో పోరాటంలో, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు నివారించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బంది, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, సర్వీస్ నందు ఎలాంటి రిమార్కులు లేకుండా పదవీ విరమణ పొందడం గర్వకారణం.
*జాదవ్ గుణవంత్ రావ్, డిసిఆర్బి సర్కిల్ ఇన్స్పెక్టర్.*
1983 సంవత్సరంలో పోలీసు వ్యవస్థలోకి కానిస్టేబుల్ గా అడుగుపెట్టి అంచలంచలుగా 1993 సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్ గా, 2003 సంవత్సరంలో ఏఎస్ఐ, గా 2012 సంవత్సరంలో ఎస్సైగా, 2021 సంవత్సరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది జిల్లా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకొని ఈరోజు పదవీ విరమణ పొందడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నందు ఉన్న పోలీస్ స్టేషన్లో చురుకుగా విధులు నిర్వర్తిస్తూ అధికారుల ప్రశంసలను, మన్నులను పొందడం జరిగింది. స్వస్థలం ఉట్నూర్ మండలం ఎంథా గ్రామానికి వ్యక్తి, ఉట్నూర్ మండల కేంద్రంలో స్థిరపడినారు. పోలీసు వ్యవస్థలో సుదీర్ఘ కాలం పాటు దాదాపు 43 సంవత్సరముల పాటు విధులు నిర్వర్తించి ఎలాంటి రిమార్కులు లేకుండా ఆరోగ్యంగా పదవి విరమణ పొందడం జరిగింది. చేసిన సేవలకు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఉత్తమ సేవా పథకాన్ని అందించి గౌరవించింది. ప్రస్తుతం సంవత్సరం కాలం నుండి డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందడం జరిగింది.
*జాదవ్ లింభాజీ నాయక్ - ఏఎస్ఐ, మావల*
1989 సంవత్సరంలో పోలీసు వ్యవస్థలోకి కానిస్టేబుల్ గా అడుగుపెట్టి అంచలంచలుగా 2012 సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్ గా, 2018 సంవత్సరంలో ఏఎస్ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం మావల పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నందు మరియు సంఘవిద్రోహ శక్తులతో పోరాటంలో కీలక పాత్ర పోషించడం తో ప్రభుత్వం గుర్తించి సేవా పథకాన్ని అందించి గౌరవించింది. దాదాపు 37 సంవత్సరాల పాటు పోలీసు వ్యవస్థలో కొనసాగి అన్ని రకాల విధులు నిర్వర్తించి ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీస్ పూర్తిచేసుకుని, ఆరోగ్యంగా పదవి విరమణ పొందడం జరిగింది
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, అదనపు ఎస్పి అడ్మిన్ పి మౌనిక, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, గిన్నెల సత్యనారాయణ, సిసి కొండరాజు, జస్వాల్ కవిత, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.