ఎస్ ఆర్ డీజే పాఠశాలలో అవినీతి, డ్రగ్స్ పై అవగాహన సదస్సు....
ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి.ఎస్.పి ఆదినారాయణ
ప్రతి విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలి..డిఎస్పి ఆదినారాయణ
చుంచు పల్లి మండలం రామ్ నగర్ లోని ఎస్ ఆర్ డీజీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన డి.ఎస్.పి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజంపై బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, డ్రగ్స్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సమాజ ఎదుగుదలలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, మన చుట్టుపక్కల జరుగుతున్న అవినీతిపై జాగరుకులై ఉండాలని, మీరూ ఎంతోమందికి మార్గదర్శకూలుగా ఎదగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు రోడ్డు వారోత్సవాల లో భాగంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఆర్ కొత్తగూడెం జోనల్ ఇంచార్జ్ సతీష్, ఎస్సై రవికుమార్ ఎస్ ఆర్ డిజి ప్రిన్సిపల్ తిరుమల్ రెడ్డి ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.