శాస్త్రాలను విమర్శించే అర్హత మందకృష్ణకు లేదు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుబ్బారావు
AIMA న్యూస్. నంద్యాల జిల్లా.
బ్రాహ్మణ సమాజంపై మరియు హిందూ సాంప్రదాయ పూజా విధానాలపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.పి.వి. సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. మందకృష్ణ తన హద్దులు దాటి మాట్లాడుతున్నారని ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని ధర్మాన్ని కాపాడుతున్నది బ్రాహ్మణులే అంటూ తెలిపారు.
ఈ సందర్భంగా కె.పి.వి. సుబ్బారావు మంగళవారం రోజున తన నివాసంలో మాట్లాడుతూ.బ్రాహ్మణులు దేవతలా? అంటూ మందకృష్ణ ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని మండిపడ్డారు. యుగాలుగా వేద మంత్ర పఠనంతో, శాస్త్రోక్తమైన పూజా విధానాలతో లోక కల్యాణం కోసం తపిస్తున్నది బ్రాహ్మణులేనని ఆయన గుర్తు చేశారు. నిష్కామంగా భగవంతుని సేవ చేస్తూ, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందిస్తున్న అర్చకత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసే హక్కు మందకృష్ణకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టి, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికే మందకృష్ణ ఇటువంటి సున్నితమైన అంశాలను లేవనెత్తుతున్నారని. పూజా విధానం అనేది ఒక శాస్త్రమని, అది ఏ ఒక్కరి సొత్తు కాదని, కానీ దానిని పద్ధతిగా నిర్వహిస్తున్న బ్రాహ్మణులపై విషం చిమ్మడం తగదని హితవు పలికారు.హిందూ సంప్రదాయాలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. మందకృష్ణ మాదిగ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతం చేస్తాం అని సుబ్బారావు స్పష్టం చేశారు.