ఇచ్చోడ మండలం లో ఐపీఎల్(క్రికెట్) బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలింపు
పత్రికా ప్రకటన:-
పోలీస్ స్టేషన్ ఇచ్చోడ
ఆదిలాబాద్ జిల్లా
తేదీ : 30.03.2026
ఇందుములంగా ఇచ్చోడ మండల ప్రజలకు మరియు మీడియా మిత్రులకు తెలియ చేయునది ఏమనగా, ఈరోజు అనగా 30.03.2026 నడు సమయం ఉదయం 10 గంటలకు ఇచ్చోడ మండల పరిధి లోని బృందావన్ కాలనీ ప్రాంతంలో ఎంప్లాయీస్ కాలనీ కి చెందిన గొలుసుల విజయ్ అను వ్యక్తి ఇచ్చోడ లోని తన స్నేహితులు అయినటు వంటి దండుగుల మురళి, జాదవ్ రాము, కాంబ్లే ఆకాష్, సీడం రవి, కాంబ్లే రాజ్‌కుమార్, కాంబ్లే అరుణ్, దాసన్న దేవాల, కాంబ్లే శశి కుమార్, సీపెల్లి శ్రీనివాస్ అను వ్యక్తులు చిట్టీల రూపంలో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు, ఇచ్చోడ పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని అట్టి బెట్టింగ్ నిర్వహిస్తున్న విజయ్ మరియు అతనితో పాటు బెట్టింగ్ లో పాల్గొంటున్న వ్యక్తులను పట్టుకొని పంచనామా నిర్వహించి 3 మోటార్ సైకిల్లు, 9 మొబైల్ ఫోన్లు, 4470/- నగధు స్వాధీనం చెసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి కేసు నమోదు చేసి అట్టి వ్యక్తులను రిమాండ్ కి తరళించనైనది అని ఇచ్చోడ పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బండారి రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశం లో IPL(cricket) నడుస్తుందటంతో అమాయకపు ప్రజలను మోసం చేసి ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో చిట్టీల రూపం లో గాని, ఆన్లైన్ లో గాని, బెట్టింగ్ అప్స్ రూపం లో గానీ మరి ఏవైనా ఇతర విధంగా బెట్టింగ్ నిర్వహిస్తే చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
(బండారి రాజు)
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఇచ్చోడ పోలీస్ స్టేషన్