logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎస్సీ కార్పొరేషన్ లోన్ల దరఖాస్తుల స్వీకరణ గడువు ఏప్రిల్ 8 వరకు పెంపు.. జిల్లా కలెక్టర్ అంకిత్, ఐ.ఏ.ఎస్.

జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ది సంఘం లి., భద్రాద్రి కొత్తగూడెం ద్వార అమలు చేస్తున్న యస్సీ కార్యచరణ ప్రణాళిక 2025-26 పధకాల నమోదుకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వ తేది వరకు పొడగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, ఐ.ఏ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసందానం తో రవాణా విభాగానికి సంబంధించి EV ద్విచక్ర వాహనాలు, త్రిచక్రాల గూడ్స్ పాసెంజర్ వాహనాలు, పశుసంవర్ధక రంగంలో పాడి పశువులు మరియు సోలార్ పంప్ సెట్ వంటి పధకాలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన ఆసక్తి కల అభ్యర్ధులు TGOBMMS ఆన్లైన్ పోర్టల్ https://tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు నమోదు చేసుకొని దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకొని హార్డ్ కాపీని మరియు అవసరమైన పత్రాలను జత పరచి గ్రామీణ ప్రాంతాల వారు MPDO కార్యాలయం లో (లేదా) పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కార్యాలయం లో సమర్పించాలని తెలియజేసారు. మరిన్ని వివరాల కొరకు 9849905990 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అంకిత్, ఐ.ఏ.ఎస్. తెలిపారు.

31
3110 views

Comment