logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టితో రాష్ట్రంలో* *పేదరికం నిర్మూలన చేయాలని* *లక్ష్యంతో ఏర్పాటుచేసిన గొప్ప* *కార్యక్రమం P4... ఎమ్మెల్యే కూన రవికుమార్

*చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టితో రాష్ట్రంలో* *పేదరికం నిర్మూలన చేయాలని* *లక్ష్యంతో ఏర్పాటుచేసిన గొప్ప* *కార్యక్రమం P4... ఎమ్మెల్యే కూన రవికుమార్* *గారు*

*ఆముదాలవలసలో ఘనంగా నిర్వహించిన P4* *మొదటి వార్షికోత్సవం కార్యక్రమం* ....

👉ఆముదాలవలస నియోజకవర్గంలో ఈ రోజు నిర్వహించిన P4 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర PUC చైర్మన్ గౌరవ శ్రీ కూన రవికుమార్ గారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

👉 జీరో పార్టీ లక్ష్యంగా ఏర్పడిన P4 తొలి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతూ ఆముదాలవలస నియోజకవర్గాన్ని పేదరిక రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “P4 కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, మెరుగైన విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని నమ్ముతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో P4 భాగస్వామ్య మార్గదర్శకులుగా ఎంపికైన వారిని సన్మానించి అవార్డులు అందజేశారు.

👉 నియోజకవర్గంలో 1007 మంది మార్గదర్శకులు, 8646 బంగారు కుటుంబాలు గుర్తించబడగా, అందులో 3182 కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకోవడం గమనార్హమని తెలిపారు. ఈ గణాంకాలు ద్వారా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని సూచిస్తున్నాయని అన్నారు.P4 కార్యక్రమం ప్రత్యేకత కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా, కుటుంబాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కూన వివరించారు. ఈ పథకం ద్వారా పేదరికం తగ్గడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

👉ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ గారు,మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనేపు రామకృష్ణ గారు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్ గారు, నారాయణ పురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల డిల్లీ గారు, మండల అధ్యక్షుడు నూక రాజు గారు కూటమి ముఖ్య నాయకులు PDDRDA అధికారులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, కూటమి ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

6
206 views

Comment